సంబంధిత వార్తలు
- టీటీడికి పాత నోట్ల తలనొప్పి.. నాలుగేళ్లైనా పట్టించుకోని కేంద్రం
- ఏపీ సర్కారు సరికొత్త నిర్ణయం-ఊరికో మహిళా పోలీస్!
- వ్యాక్సిన్ వేయించుకుంటేనే వేతనాలు : మధ్యప్రదేశ్ సర్కారు
- కోవిడ్: పిల్లల్ని బడికి పంపాలా వద్దా? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రుల్లో ఆందోళన
- విభిన్న ప్రతిభావంతుల కోసం వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
ఆధార్- పాన్ కార్డు అనుసంధానం.. సెప్టెంబర్ 30వరకు గడువు పెంపు
ఆధార్- పాన్ కార్డు అనుసంధానం ఇంకా పూర్తి చేయని వారికి గుడ్ న్యూస్. ఆధార్- పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన ఈ అనుసంధాన ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు పాన్ కార్డు దారులు తమ ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవచ్చు. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ గడువును మరో దఫా పొడిగించింది.
అలాగే సొంతింటిపై పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపును మూడు నెలలకు పైగా పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. అలాగే వివాద్ సే విశ్వాస్ చెల్లింపుల పథకాన్ని రెండు నెలలు పొడిగించింది.
కరోనా చికిత్స పొందిన వారికి, మరణించిన వారికి పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఒక ఉద్యోగికి యాజమాన్యం చెల్లించిన కొవిడ్ వైద్య చికిత్స మొత్తంపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది.
తర్వాతి కథనం
