1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Nokia's latest 4G feature phone goes official at Rs. 2,800

భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే నోకియా 110 4జీ

Nokia
nokia
భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే 4జీ ఫీచర్ ఫోన్ ని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
 
యల్లో ఆక్వా, బ్లాక్ కలర్‌లో లభించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
 
క్లాసిక్‌, నియోల మేళవింపుతో నోకియా 110 4జీ స్లీక్ న్యూ డిజైన్‌, అసాధారణ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఈ ఫోన్‌ను సులభంగా వినియోగించడంతో పాటు అందుబాటు ధరలో మెరుగైన నాణ్యతతో కూడిన సీమ్‌లెస్ అనుభూతిని ఇస్తుందని సింగ్ చెప్పారు.
About Writer
సెల్వి