శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (19:21 IST)

నోకియా 5.4 స్మార్ట్ ఫోన్‌.. భారత్‌లో రిలీజ్ ఎప్పుడు..?

Nokia 5.4
నోకియా 5.4 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్‌లో దీనికి సంబంధించిన ప్రత్యేక పేజీని కూడా తీసుకువచ్చారు. ఇందులో వీటికి సంబంధించిన ఫీచర్లను కూడా టీజ్ చేశారు. నోకియా 5.4 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ డిసెంబర్‌లోనే జరిగింది. 
 
నోకియా 5.3కి తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్‌ను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు కూడా ఉన్నాయి. ఇందులో ఓజో ఆడియో సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 128 జీబీ స్టోరేజ్ కూడా అందించనున్నారు. 
 
నోకియా 5.4 టీజర్ పేజీలో ఈ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుందని తెలిపారు. ఈ ఫోన్ ముందువైపు, వెనకవైపు భాగాలను చూపుతూ టీజర్లను విడుదల చేశారు. దీని ల్యాండింగ్ పేజీలో లాంచ్ తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈ ఫోను ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కానుంది. నోకియా 3.4తో పాటు ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. యూరోప్‌లో ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.