1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Over 800 WhiteHat Jr workers resign when asked to work from office: Report

ఆఫీసుకు రమ్మన్నందుకు 800 మంది ఉద్యోగులు రాజీనామా.. ఎక్కడ?

WhiteHat Jr Workers
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని అనేక ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. దీంతో గత రెండేళ్లుగా అనేక మంత్రి ఐటీ ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద నుంచే తమతమ ఆఫీస్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో అనేక కంపెనీలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఫలితంగా అనేక మంది ఐటీ ఉద్యోగులు తమతమ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లిపోతున్నారు. 
 
ఈ క్రమంలో వైట్ హ్యాట్ జూనియర్ (జేఆర్) అనేక కంపెనీకి ఉద్యోగులు తేరుకోలేని షాకిచ్చారు. వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని రద్దు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఆఫీసుకు రావాలంటూ ఆదేశించింది. ఆ కంపెనీలో పని చేసే అనేక మందికి ఏమాత్రం మింగుడు పడలేదు. ఫలితంగా గత రెండు నెలలో ఈ లెర్నింగ్ స్టార్టప్ కంపెనీ వైట్‌హ్యాట్ జేఆర్‌‍కు  చెందిన ఉద్యోగుల్లో ఏకంగా 800 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఐఎన్‌సీ42 తెలిపింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కడప అడ్డాలో ఆడబిడ్డకు అన్యాయం.. కనిపించని జ"గన్" : నారా లోకేశ్