1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance JIO Dasara Bumper Offer

జియో దసరా బంపర్ ఆఫర్ .. రూ.699కే ఫోన్

Reliance JIO
దేశ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరోమారు దసరా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా వినియోగదారులకు కోసం ఈ ఆఫర్‌ను వెల్లడించింది. ఇప్పటివరకు జియో ఫోన్‌ను రూ.1500కు విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌ను ఇపుడు రూ.699కే విక్రయించనుంది. 
 
అందుకుగాను గతంలో మాదిరిగా ఎలాంటి ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన పనిలేదు. నేరుగా అదే ధరకు జియో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌ను కొన్న వారికి మొదటి 7 రీచార్జిలపై అదనంగా రూ.99 విలువైన మొబైల్ డేటాను జియో ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. 
 
దీంతో ఫోన్ కొనుగోలుపై రూ.800, 7 రీచార్జిల డేటా విలువ రూ.700 కలిపి మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చు. కేవలం దీపావళి పండుగ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నా భార్య గర్భవతి.. ఆమెకు, నాకు.. ఒకరే తండ్రి.. ఏం చేయమంటారు..?