శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (15:21 IST)

మైక్రోసాఫ్ట్‌తో రిలయన్స్ జియో డీల్.. అజుర్ క్లౌడ్ సర్వీస్‌ ఫ్రీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా రిలయన్స్ జియో సంస్థ ప్రపంచ నెంబర్ వన్ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. దీంతో భారత డిజిటల్ రూపును దేదీప్యమానంగా వెలిగించేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 
 
ఇందుకు అవసరమయ్యే అజుర్ కంప్యూటర్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అంతేకాదు, భారతీయ టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందించనున్నట్లు ముఖేశ్ అంబానీ తెలిపారు. చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్‌ను నెలకు కేవలం రూ.1500కే అందించనున్నట్లు ముకేష్ అంబానీ తెలిపారు.