1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Vi introduces data rollover benefit for unlimited prepaid plans starting at Rs 249

వీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. డేటా రోల్ ఓవర్ ఆఫర్.. ఎందుకంటే?

Vi
వొడాఫోన్, ఐడియా కస్టమర్ల ఓ గుడ్ న్యూస్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలో వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో.. 'వీఐ' తాజాగా డేటా రోల్ ఓవర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను 'వీఐ' తన అధికారిక వెబ్ సైట్లో పొందుపర్చింది.

ఈ నూతన ఆఫర్లో భాగంగా వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు క్రిందటి వారంలో ఉపయోగించని డేటా తర్వాతి వారానికి బదిలీ చేయబడుతుంది. 
 
అయితే, ఈ వారాంతపు డేటా రోల్ఓవర్ ఆఫర్ కేవలం అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్లను సబ్ స్క్రైబ్ చేసుకున్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే వినియోగదారుడు రూ. 249లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 
 
కాగా, ప్రస్తుతం 'వీఐ' ప్రీపెయిడ్ కస్టమర్లు వారి ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా పరిమిత మొబైల్ డేటాను మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. వినియోగదారుడు తాము ఆ రోజు ఉపయోగించని డేటా మరుసరి రోజుకు బదిలీ అయ్యే అవకాశం ఉండేది కాదు. కానీ, ఈ నూతన డేటా రోల్ఓవర్ ఆఫర్ కింద చేరిన వినియోగదారులు తాము ఉపయోగించని డేటాను సైతం ఆస్వాదించగలుగుతారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రైతులకు చేసే సాయానికి పిచ్చి షరతులు పెడతారా?: టీడీపీ రైతు విభాగం