గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (15:43 IST)

చెన్నైలో కుమరన్ సిల్క్స్ మూసివేత.. ఎందుకో తెలుసా?

చెన్నై మహానగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణాల్లో చెన్నై సిల్క్స్ ఒకటి. చెన్నైలోని వాణిజ్య కేంద్రమైన టినగరులో ఇదివుంది. అయితే, ఈ దుకాణాన్ని చెన్నై నగర పాలక సంస్థ అధికారులు మంగళవారం మూసివేశారు. దీనికి కారణం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే. 
 
ఈ షాపుకు భారీ సంఖ్య‌లో నగర వాసులు ఒక్కసారిగా వచ్చారు. దానికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ.. అధిక సంఖ్య‌లో జ‌నం షాపుకు వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సోష‌ల్ డిస్టాన్సింగ్ నిబంధ‌న‌లను ఉల్లంఘించిన కుమర‌న్ సిల్స్స్ షాపును చెన్నై కార్పొరేష‌న్ అధికారులు మూసివేశారు. 
 
కాగా, గత యేడాది ఈ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మొత్తం భవనాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మించారు. ఈ దుకాణాన్ని కరోనా లాక్డౌన్‌కు ముందు అంటే గత దసరా సీజన్‌లో తెరిచారు. అయితే, ఇపుడు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను మూసివేశారు.