1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Vodafone introduces new Rs 99 prepaid plan

వోడాఫోన్ నుంచి కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్

Vodafone
వోడాఫోన్ ఐడియా కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త వోడాఫోన్ ఆఫర్ ధర రూ. 99గా నిర్ణయించారు. డిజిటల్ ఇండియా వృద్ధిని పరిగణనలోకి తీసుకుని వోడాఫోన్ ఐడియా ఈ కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఇది కాకుండా, అర్ధరాత్రి 12.00 నుండి ఉదయం 6.00 గంటల వరకు ఉచిత అపరిమిత హైస్పీడ్ డేటా అందించబడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలు వీఐ రూ. 249.. అంతకంటే ఎక్కువ ఆఫర్‌లకు రీఛార్జ్ అవసరం. 
 
ఈ ధరలో వినియోగదారులకు డేటా, వాయిస్ ప్రయోజనాలను అందించే ఏకైక హై-స్పీడ్ డేటా నెట్‌వర్క్ వొడాఫోన్ కంపెనీ ఇటీవల ప్రకటించిన ఆఫర్ గరిష్టంగా 5 జీబీ అదనపు డేటాను అందిస్తుంది.

రూ. 99 ఆఫర్ సెకనుకు 2.5 పైసల చొప్పున 200MB డేటాతో పాటు లోకల్, నేషనల్ కాల్స్‌లను అందిస్తుంది. ఈ ఆఫర్ వాలిడిటీ 28 రోజులు. ఇది ఎలాంటి SMSప్రయోజనాలను అందించదు. కొత్త ఆఫర్‌తో వినియోగదారులు తక్కువ ధరకే కనెక్టివిటీని పొందవచ్చు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
నా ఫోన్ ట్యాప్ చేశారు.. వైకాపా టిక్కెట్‌పై పోటీ చేయను : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి