శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (21:40 IST)

టాప్ గేర్‌‍లో రిలయన్స్ జియో... కొత్తగా 14 లక్షల యూజర్లు

jioservice
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ మొబైల్ కనెక్షన్ వినియోదరాలు సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గత అక్టోబరు నెలలో ఏకంగా 14 లక్షల మంది కస్టమర్లు జియో కనెక్షన్లు తీసుకున్నారు. అలాగే, ఎయిర్‌టెల్ కూడా 8.05 లక్షల మందికి కొత్తగా కనెక్షన్లు ఇచ్చింది. అయితే వొడాఫోన్ - ఐడియా మాత్రం 35 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
 
రిలయన్స్ జియో అక్టోబరు నెలలో 14 లక్షలమంది యూజర్లను సంపాదించగా, అంతకుముందు సెప్టెంబరు నెలలో 7.24 మంది కొత్త చందాదారులు చేరారు. అలాగే, ఎయిర్‌టెల్‌కు అక్టోబరు 8.05 లక్షలు, సెప్టెంబరు 4.12 లక్షల మంది చందాదారులు వచ్చి చేరారు. వోడాఫోన్ మాత్రం సెప్టెంబరులో 40.11లక్షల కనెక్షన్లు కోల్పోగా, అక్టోబరు నెలలో మాత్రం 35.09 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. 14.