శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

వాట్సాప్ సరికొత్త ఫీచర్లు... వీడియో కాల్ కోసం న్యూలింక్

whatsapp
ప్రముఖ సోషల్ మెజేసింగ్ యాప్ వాట్పాస్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. లింకు ద్వారా వీడియో కాల్ లేదా ఫోన్ కాల్ చేసుకునే వీలు కల్పించనుంది. 
 
ఇక నుంచి వాట్సాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్‌ల కోసం ఇతరులను ఆహ్వానించేందుకు ప్రత్యేక లింక్‌లను ఉపయోగించుకోవచ్చు. లింక్‌పై క్లిక్‌ చేసిన వెంటనే కాల్‌లో చేరేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. 
 
వాట్సప్‌లోని 'కాల్‌' సెక్షన్‌లోకి వెళ్లి లింక్‌ను సృష్టించొచ్చు. అయితే, ఇందుకోసం వాట్సాప్ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాట్సప్‌ మాతృసంస్థ 'మెటా' సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సోమవారం ఫేస్‌బుక్‌ వేదికగా ఈ విషయాలను 
 
ఇదిలావుంటే, వాట్సప్‌లో ఒకేసారి 32 మంది గ్రూప్‌ వీడియోకాల్‌ మాట్లాడుకునేందుకూ వీలు కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత ప్రయోగ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఇవి త్వరలోనే సానుకూల ఫలితాలు లభిస్తాయని భావిస్తున్నట్టు వెల్లడించారు.