మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:47 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్: డిలీట్ చేసే ఆప్షన్ వచ్చేస్తుందిగా..

whatsapp
ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ రానుంది. వాట్సాప్‌లో ఒకరికి మెస్సేజ్ పంపిన తర్వాత, సాధారణంగా గంట వరకు దాన్ని అవతలి వారి ఫోన్‌లో లేకుండా డిలీట్ చేసే ఆప్షన్ పంపిన వారికి ప్రస్తుతం ఉంది. ఇకపై రెండు రోజుల వరకు పంపిన మెస్సేజ్‌ను అవతలి వారి ఫోన్ నుంచి తొలగించుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. 
 
ఇక వాట్సాప్ లో గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు లభించనున్నాయి. గ్రూపులోని ప్రతి ఒక్కరి ఫోన్‌లో మెస్సేజ్‌లు డిలీట్ అయ్యే ఆప్షన్ అడ్మిన్లకు ఉంటుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.