శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (12:42 IST)

బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్.. ఆగస్టులో సెలవులు ఎన్ని?

bank holiday
ఆగస్టు నెలలో బ్యాంకు ఖాతాదారాలు అప్రమత్తంగా ఉండాలి. శని, ఆదివారాలతో పాటు.. పలు పబ్లిక్ హాలిడేస్‌ కూడా వస్తున్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకులు మూసివేస్తారు. అందువల్ల బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులు పని చేసే రోజులను తెలుసుకుని తమ పనుల కోసం బ్యాంకులకు వెళ్ళాలి. 
 
ఆగస్టు నెల నుంచి దేశ వ్యాప్తంగా ఫెస్టివల్ సీజన్ మొదలవుతుంది. ఇందులోభాగంగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, వినియకచవితి వంటి అనేక పండగలు ఉన్నాయి. దీంతో బ్యాంకులకు సెలవులు భారీగానే రానున్నాయి. ఈ క్రమంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆగస్టు నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. ఆ ప్రకారంగానే బ్యాంకులు పని చేయనున్నాయి. 
 
ఆర్బీఐ వీడుదల చేసిన జాబితా ప్రకారం.. 
 
ఆగస్టు ఒకటో తేదీన సిక్కిం రాష్ట్రంలని గ్యాంగ్‌కట్‌లో అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. 
ఆగస్టు 7న ఆదివారం
ఆగస్టు 8న మొహర్రం
ఆగస్టు 9న మొహర్రం సెలవు
ఆగస్టు 11, 12 తేదీన రక్షాబంధన్ 
ఆగస్టు 13న రెండో శనివారం 
ఆగస్టు 14న ఆదివారం
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆగస్టు 16న పార్సీ నూతన సంవత్సర వేడుకలు 
ఆగస్టు 18న శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్టు 19న శ్రావణ వద్ లేదా కృష్ణ జయంతి
ఆగస్టు 21న ఆదివారం
ఆగస్టు 28న ఆదివారం 
ఆగస్టు 29న శ్రీమంత శంకరదేవుని తిథి
ఆగస్టు 31న వినాయక చవితి