మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (15:24 IST)

యూజర్ల డేటాను విదేశాలకు చేరవేస్తున్న యాప్స్ : కేంద్రం కొరఢా

Apps
కేంద్ర ప్రభుత్వం మరో 348 యాప్స్‌ను నిషేధించింది. ఈ విషయాన్ని మంత్రి చంద్రశేఖర్ వెల్లడించారు. భారత యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్ సేకరించి విదేశాల్లో ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్టు తేలడంతో కేంద్రం ఈచర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 
విదేశాల్లోని సర్వర్లకు యూజర్ల డేటాను పంపుతున్న 348 యాప్స్‌ను గుర్తించి నిషేధం విధించామని తెలిపారు. ఇలా విదేశఆలకు డేటా చేరితే భారత సమగ్రత, భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుందని అందుకే ఈ యాప్స్‌పై నిషేధం విధించినట్టు తెలిపారు.
 
నిషేధించిన యాప్స్‌లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2020 కింద చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన యాప్స్ కూడా ఉన్నాయని తెలిపారు. గత రెండేళ్ళలో దశల వారీగా ఈ ప్రక్రియ జరిగిందని, వీటిలో ఎంతో పాపులర్ అయిన షార్ట్ వీడియోస్ యాప్ టిక్‌టాక్‌తో పాటు బ్యాటిల్ రొయాల్ గేమ్ పబ్‌జి వంటివి ఉన్నాయని ఆయన వివరించారు.