శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (14:41 IST)

ఖాట్మండ్‌లో పానీపూరీలపై నిషేధం.. కారణం కలరా బ్యాక్టీరియా..

Panipoori
Panipoori
ఖాట్మండ్‌లో పానీపూరీలపై నిషేధం విధించారు. పానీపూరిలో వాడే నీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. కలరా కేసులు పెరుగుతుండడానికి పానీ పూరిలో ఉపయోగించే అపరిశుభ్రమైన నీరు కారణమని బావించిన అధికారులు పానీ పూరి అమ్మకాలపై నిషేదం విధించారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఖాట్మండ్ వ్యాలీలో ఇటీవల కలరా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు అయ్యాయి. ఇందుకు కారణం పానీపూరిలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 
 
దీంతో నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, కారిడార్ ప్రాంతాల్లో పానీపూరీ విక్రయాలను నిలిపివేయించారు. అంతేకాకుండా పానీ పూరీ విక్రయాలు, పంపిణీని నిషేదించినట్లు లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ అధికారులు తెలిపారు. ఎవరికైనా కలరా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని వెళ్లాలని సూచించారు.