బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (19:36 IST)

నేపాల్‌లో వరదలు: 16 మంది మృతి, 22 మంది గల్లంతు

floods
హిమాలయ ప్రాంతమైన నేపాల్‌లో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. మనాంగ్, సింధుపాల్‌చోక్ జిల్లాల్లో వరదలతో 16 మంది మృతి చెందగా, మరో 22 మంది జాడ గల్లంతైనట్టు నేపాల్ ఆర్మీ తెలిపింది. 
 
వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం, జల దిగ్బంధంలో చిక్కుకున్నవారిని కాపాడటం, బాధితుల సహాయ, పునరావసంపై ప్రభుత్వం దృష్టి సారించిందని హోం వ్యవహారాల శాఖ ప్రతినిధి జనక్‌రాజ్ దహల్ తెలిపారు.  
 
లాంజుంగ్, మ్యగ్డి, ముస్తాంత్, మనాంగ్, పల్ప, బజ్‌హాంగ్‌లలో వరదలు, కొండచరియల ఘటనల ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. తమకోసి నదీతీర ప్రాంతం, నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.