శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:55 IST)

భారత్‌లో 348 యాప్స్‌పై నిషేధం.. మంత్రి చంద్రశేఖర్

BGMI
భారత్‌లో యాప్స్ బ్యాన్ గురించి కేంద్రం తాజాగా అధికారిక ప్రకటన చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ విషయంపై కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాచారం వెల్లడించారు.
 
దేశంలో ఇప్పటి వరకు 348 యాప్స్‌పై నిషేధం విధించినట్టు మంత్రి చంద్రశేఖర్ ప్రకటించారు. భారత యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్ సేకరించి.. వేరే దేశాల్లో ఉన్న సర్వర్‌లకు చేరవేస్తున్నట్టు గుర్తించామని, అందుకే బ్యాన్ చేసినట్టు వెల్లడించారు. 
 
విదేశాల్లోని సర్వర్స్‌కు యూజర్ల డేటాను పంపుతున్న 348 యాప్స్‌ను గుర్తించి, బ్యాన్ విధించామని ప్రకటించారు. ఇలా విదేశాలకు డేటా చేరితే భారత సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందుకే బ్యాన్ చేసినట్టు స్పష్టం చేశారు.
 
తాజాగా బ్యాటిల్ రొయాల్ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్ మొబైల్‌ ఇండియా (BGMI)పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ఈ గేమ్‌ను తొలగించాయి. ఐటీ యాక్ట్ 2020 కిందే BGMIను కూడా నిషేధించింది.