శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (18:44 IST)

ప్రణీత పాదపూజపై ట్రోలింగ్.. తప్పేంటి అంటూ ఘాటుగా రిప్లై

Pranitha
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భర్తకు పాదపూజ విషయంలో కొంతమంది హీరోయిన్ ప్రణీతను ప్రశంసిస్తే మరి కొందరు మాత్రం ప్రణీతను ట్రోల్ చేశారు. ప్రణీత చేసిన పూజ భీమన అమవాస్య పూజ కాగా ఈ పూజ చేయడం వల్ల పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 
 
కొంతమంది ప్రణీత పాదపూజ చేయడంతో ఆమె ఏ కాలంలో ఉందో అంటూ ఆమెను ట్రోల్ చేశారు. వైరల్ అవుతున్న ట్రోల్స్ గురించి తాజాగా స్పందించిన ప్రణీత సుభాష్ ఘాటుగా బదులిచ్చారు.
 
లైఫ్‌లో జరిగే ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయని ప్రణీత అన్నారు. ఏం చేసినా 90 శాతం జనాలు పాజిటివ్‌గా స్పందిస్తారని 10 శాతం జనాలు మాత్రం నోటికొచ్చిన విధంగా వాగుతారని ప్రణీత తెలిపారు. అదంతా  పట్టించుకోనని ప్రణీత కామెంట్లు చేశారు. 
 
నటిగా తాను గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నంత మాత్రాన ఆచారాలను పాటించనని ఎందుకు అనుకుంటున్నారని ప్రణీత ఫైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ పెరిగానని ఆమె చెప్పుకొచ్చారు.
 
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన ప్రణీత అత్తారింటికి దారేది సినిమా సక్సెస్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు సినీ అవకాశాలు కలిసిరాలేదు. 
 
గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత ప్రస్తుతం కుటుంబానికే పూర్తి సమయాన్ని కేటాయిస్తుండటం గమనార్హం. కొన్నిరోజుల క్రితం ప్రణీత భర్త నితిన్ రాజుకు పాద పూజ చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.