శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (16:59 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్... కెప్ట్ మెస్సేజెస్ ద్వారా ఆ పని చేయొచ్చు..

whatsapp
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ రానుంది. వాబీటా ఇన్ఫో సమాచారం మేరకు.. "కెప్ట్ మెస్సేజెస్" అనే ఫీచర్ ను అభివృద్ది చేస్తోంది. వాట్సాప్ "డిసప్పియరింగ్ మెస్సేజెస్" అనే ఫీచర్ ను ఎప్పుడో తీసుకొచ్చింది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే.. నిర్దేశించిన సమయం తర్వాత మెస్సేజెస్ కనిపించకుండా పోతాయి. అయితే కెప్ట్ మెస్సేజెస్ ఫీచర్ ను వాట్సాప్ ఎప్పుడు అమల్లోకి తెస్తుందన్నది తెలియరాలేదు. 
 
కానీ, ఇలా మెస్సేజ్ లు కొంత సమయం తర్వాత కనిపించకుండా పోవడం నచ్చని వారి కోసం ‘కెప్ట్ మెస్సేజెస్’ అనే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ‘డిసప్పియరింగ్ మెస్సేజెస్’ను ఎనేబుల్ చేసుకున్నా సరే.. మెస్సేజ్ లను జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు. పంపిన వారు, స్వీకరించిన వారు సైతం సేవ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఆయా చాట్స్ ను సైతం తొలగించుకోవచ్చు.