గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (18:53 IST)

టాటా యాజమాన్యంలో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు పసైందన విందు

air india
ఎయిర్ ఇండియాకు పూర్వవైభవం కల్పించేందుకు ఆ సంస్థ యాజమాన్యమైన టాటా గ్రూపు వివిధ రకాలైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, పండగ సీజన్‌ సందర్భంగా దేశీయ విమాన సేవల్లో కొత్త ఆహార మెనూను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తాజాగా ప్రకటన చేసింది. 
 
రుచికరమైన భోజనాలు, అధునాతన అపిటైజర్స్‌ (భోజనానికి ముందు ఇచ్చే పదార్థాలు), నాణ్యమైన డెజర్ట్స్‌ (భోజనానంతరం ఇచ్చే పదార్థాలు)ను కొత్త మెనూలో చేర్చినట్లు తెలిపింది. భారతీయ వంటకాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు తెలిపింది. 
 
ఈ కొత్త మెనూ అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతానికి ఈ కొత్త మెనూను దేశీయ విమాన సర్వీసుల్లోనే అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. త్వరలోనే అంతర్జాతీయ సేవలకు విస్తరిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అంతర్గత సేవల విభాగం హెడ్ సందీప్ వర్మ తెలిపారు. 
 
కాగా, ఇటీవలే ఎయిర్ ఇండియా 'విహాన్‌.ఏఐ' పేరిట దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించింది. రాబోయే అయిదేళ్లలో దేశీయ విమానయాన విపణిలో కనీసం 30 శాతం వాటా పొందడంతో పాటు అంతర్జాతీయ కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది.