విద్యార్థులకు వృద్ధులకు టాటా ఎయిర్ ఇండియా షాక్!
టాటా యాజమాన్య గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విద్యార్థులకు, వృద్ధులకు షాకిచ్చింది. ఎకానమీ తరగతిలో విద్యార్థులు, వయోవృద్ధులకు బేసిక్ పేపై గతంలో 50 శాతం రాయితీ ఇస్తుండగా, దాన్ని 25 శాతానికి తగ్గించింది. అంటే ఇక నుంచి 25 శాతం మాత్రమే రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
ఇది సెప్టెంబరు 29వ తేదీ తర్వాత కొనుగోలు చేసే అన్ని టిక్కెట్లపై వర్తిస్తుందని పేర్కొంది. అదేసమయంలో ఈ రాయితీని తగ్గించడాన్ని టాటా యాజమాన్యం సమర్థించుకుంది.
డిస్కౌంట్ రాయితీపై 25 శాతం కోత విధించినప్పటికీ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లు అందిస్తున్న దానికి ఇది రెండు రెట్లు అధికంగానే ఉందని స్పష్టం చేసింది. మార్కెట్‌లో పరిస్థితులు అనుగుణంగా టికెట్ ధరలను రేషనలైజ్ చేయాలని నిర్ణయించినట్టు వివరించింది.