గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (16:39 IST)

ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్

airasia
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఏసియా విమాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఏకంగా 50 లక్షల ఉచిత టిక్కెట్లను అందుబాటులోకి ఉంచింది. ఈ టిక్కెట్లు మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆ కంపెనీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 
 
ఈ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ బిగ్ సేల్‌ను ప్రకటించింది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంలలో అనేక ఏసియా దేశాల ప్రయాణికులు కూడా ఈ అఫర్‌కు అర్హులని తెలిపింది. రెండు నెలల క్రితం ఎయిర్ ఏసియా కస్టమర్లకు ఉచిత టిక్కెట్లను అందించిన విషయం తెల్సిందే.