సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (13:36 IST)

జార్ఖండ్‌లో శివాన్ నదిలో బోల్తాపడిన బస్సు - ఏడుగురి మృతి

bus accident
జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో దారుణం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి నియంత్రణ కోల్పోయి శివాన్ జిల్లాలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రమాద స్థలంలోను, మరో ఐదుగురు ఆస్పత్రిలో చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ బస్సు గిరిదిహ్ నుంచి రాంచీకి వెళుతుండగా, బస్సు తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సివాన్నే నదిలో బ్రిడ్జి పైనుంచి అదుపుతప్పి నదిలో పడిపోయింది. బ్రిడ్జి రెయిలింగ్‌ విరిగిపోయిన ప్రదేశంలోనే ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీతెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇద్దరు మరణించగా, మరో ఐదుగురు హజారీబాద్ సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు ఒక డీఎస్పీ ర్యాంక్ అధికారి, ముగ్గురు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌లను ప్రమాద స్థలం వద్ద నియమించారు.
 
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై నుండి బస్సు పడిపోవడంతో ప్రయాణీకులు మరణించడం చాలా బాధ కలిగించిందని, దేవుడు మరణించిన ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని, ఈ విషాదాన్ని భరించే శక్తిని వారి కుటుంబాలకు ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్విటర్ ద్వారా తెలిపారు.