గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (10:03 IST)

ప్రియుడితో చెడు తిరుగుళ్లు వద్దన్న తమ్ముడు.. చంపేసిన అక్క.. ఎక్కడ?

murder
తన అక్కకు ఓ తమ్ముడు హితవచనాలు పలికాడు. ప్రియుడితో కలిసి చెడు తిరగొద్దని చెప్పాడు. ఈ మాటలు ఆమెకు ఏమాత్రం రుచించలేదు. తనకే శుద్ధులు చెబుతావా అంటూ సొంత తమ్ముడిని అక్క చంపేసింది. ఈ హంతకురాలు ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ జిల్లాకు చెందిన చంచల్ కుమారి అనే 25 యేళ్ల యువతి ఓ థర్మల్ పవర్ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తుంది. ఆ పవర్ స్టేషన్‌కు సంబంధించి క్వార్టర్స్‌లోనే ఉంటుంది. ఆమె సోను అన్సారీ అనే వ్యక్తిని ప్రేమిస్తూ వచ్చింది. ఈ విషయం ఆ యువతి సోదరుడు రోహిత్ కుమార్‌కి తెలిసి, అతను మన కులంకాదని, అతన్ని ప్రేమిస్తూ, అతనితో చెడు తిరుగుళ్లు తిరగొద్దని 21 యేళ్ల తమ్ముడు కోరాడు. ఇది ఆ యువతికి ఏమాత్రం రుచించలేదు. దీన్ని మనస్సులో పెట్టుకున్న ఆ యువతి తన ప్రియుడితో కలిసి సొంత తమ్ముడినే కడతేర్చింది. 
 
తన కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ యువతి నివశించే గృహ సముదాయ ప్రాంగణంలోనే రోహిత్ మృతదేహం లభించింది. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా ఆరా తీశారు. తన ప్రియుడు కలిసి హత్య చేసినట్టుగా చంచల కుమారి అంగీకరించినట్టు అంగీకరించింది. దీంతో చంచల్ కుమారితో పాటు ఆమె ప్రియుడు అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు.