జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోలు మృతి
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్‌లో ఈ నెల 2వ తేదీన భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తాజాగా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటరులో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శుక్రవారం ఉదయం బరుడా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ దళాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
భద్రతా బలగాలను రాకను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని కొల్హాన్ ఐజీ అజయ్ లిండ్ తెలిపారు. వీరి నుంచి విప్లవ సాహిత్యంతో పాటు తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.