మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (14:44 IST)

గౌహతి టీ 20కి వర్షం అడ్డంకి... మ్యాచ్ సజావుగా సాగేనా..

cricket stadium
ఆతిథ్య భారత్, పర్యాటక సౌతాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా కీలకమైన రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. అయితే.. గౌహతిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఆక్యూవెదర్‌ తెలిపింది. ఆదివారం రాత్రి 3 గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
స్టేడియంలో మ్యాచ్‌ వీక్షించేందుకు టికెట్లు కొన్న అభిమానులు ఈ వార్తతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి.
 
మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్‌ కవర్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్లు అస్సాం క్రికెట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.
 
మరోవైపు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. సౌతాఫ్రికా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఇపుడు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరివెళ్ళనుంది.