మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (23:20 IST)

భారతదేశంలో వరుసగా పలు రోడ్‌ షోలను నిర్వహించిన శ్రీలంక టూరిజం

image
భారతదేశంతో తమ ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడాన్ని శ్రీలంక టూరిజం కొనసాగిస్తూ భారతదేశంలోని పలు ముఖ్యమైన నగరాలలో 26సెప్టెంబర్‌ నుంచి 30 సెప్టెంబర్‌ 2022 వరకూ వరుసగా పలు రోడ్‌ షోలను చేసింది. ఈ సిరీస్‌లో మొదటి రోడ్‌ షోను న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో 26 సెప్టెంబర్‌ 2022 న నిర్వహించారు. అనంతరం సెప్టెంబర్‌ 28వ ముంబైలోని సెయింట్‌ రెగిస్‌ హోటల్‌లో ఈ రోడ్‌ షో చేయగా, ముగింపు రోడ్‌షోను హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో 30 సెప్టెంబర్‌ 2022న నిర్వహించారు
 
ఈ రోడ్‌షోలను నిర్వహించడానికి ప్రధాన కారణం, శ్రీలంకను అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేయడం. పర్యాటక పరంగా శ్రీలంకకు అతి ముఖ్యమైన ప్రాంతం ఇండియా. అంతేకాదు కొవిడ్‌ మహమ్మారి అనంతర కాలం, ఇటీవల ఆర్థిక సంక్షోభ సమయంలో సైతం శ్రీలంకకు వెన్నుదన్నుగా ఇండియా నిలిచింది. శ్రీలంకకు ఇప్పుడు చెప్పుకోతగ్గ రీతిలో పర్యాటకులు వస్తున్నారు. వీరిలో అధికశాతం భారతదేశం నుంచి ఉంటున్నారు.
 
ఈ రోడ్‌ షోల ద్వారా విస్తృత శ్రేణి పర్యాటక అనుభవాలను సైతం ప్రచారంపై దృష్టి సారించడంతో పాటుగా సంభావ్య పర్యాటకులు తమ బుకింగ్స్‌ను చేసుకునేలా ప్రోత్సహించడం చేస్తున్నారు. అదే సమయంలో విశ్రాంత, వ్యాపార, ఎంఐసీఈ పర్యాటకానికి శ్రీలంక ద్వారాలు తెరిచి ఉన్నాయని వెల్లడిస్తున్నారు. ఈ రోడ్‌ షోలలో లక్ష్యిత వినియోగదారులుగా టూర్‌ ఆపరేటర్లు, మీడియా, కీలక ఇన్‌ఫ్లూయెన్సర్లు, కార్పోరేట్స్‌, ట్రేడ్‌ అసోసియేషన్స్‌ మరియు కీలక  పర్యాటక పరిశ్రమ వాటాదారులు ఉంటారు. వీరంతా కూడా శ్రీలంక దేశం అత్యంత అందమైన దేశాలలో ఒకటి అనే సందేశం తెలపడంతో పాటుగా సురక్షితమైన దేశం అనే సందేశాన్నీ వ్యాప్తి చేయనున్నారు. ఇక్కడ అవసరమైన ఆరోగ్య, భద్రతా మార్గదర్శకాలన్నీ పాటిస్తున్నారు.
 
దాదాపు 50 కు పైగా స్ధానిక ట్రావెల్‌ ఏజెన్సీలు, హోటల్స్‌తో కూడిన బృందం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఈ డెలిగేషన్‌కు గౌరవనీయ పర్యాటక శాఖ మంత్రి  హరిన్‌ ఫెర్నాండో నేతృత్వం వహించగా, శ్రీలంక టూరిజం ప్రమోషన్‌ బ్యూరో ఛైర్మన్‌ చలక గజబాహు; శ్రీలంక కన్వెన్షన్‌ బ్యూరో ఛైర్మన్‌ తిషుమ్‌ జయసూర్య కూడా పాల్గొన్నారు. వీరితో పాటుగా శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ మరియు మాస్టర్‌కార్డ్‌ ప్రతినిధులు సహా ఎంతోమంది వాటాదారులు కూడా దీనికి మద్దతునందిస్తున్నారు. ప్రతి రోడ్‌ షో లోనూ బీ2బీ సెషన్స్‌తో పాటుగా పలు చర్చా కార్యక్రమాలను సైతం  నిర్వహించారు. సాయంత్రం నెట్‌వర్కింగ్‌ సైతం నిర్వహించారు. దీనిద్వారా వ్యాపారావకాశాలను సైతం పెంచుకుంటున్నారు.
 
ఈ కార్యక్రమాలకు కాస్త గ్లామర్‌ సైతం జోడిస్తున్నారు. సెలబ్రిటీలు అయిన సనత్‌ జయసూర్య వంటి వారు పాల్గొంటున్నారు. అలాగే డ్యాన్స్‌, వినోద కార్యక్రమాలను సైతం ప్రతి కార్యక్రమంతోనూ నిర్వహించడం ద్వారా వీక్షకులకు అత్యద్భుతమైన అనుభవాలను అందిస్తున్నారు. అలాగే శ్రీలంకన్‌ సంస్కృతిని గురించి తెలుసుకునే అవకాశమూ అందిస్తున్నారు,  ఈ కార్యక్రమాలలో నృత్య బృందం తమ ప్రతిభను ప్రదర్శిస్తుంది. ఈ రోడ్‌షోలలో గౌరవనీయ పర్యాటక శాఖ మంత్రి పలువురు ఉన్నత వ్యాపార వేత్తలు, పర్యాటక రంగ ప్రముఖులు, కార్పోరేట్లతో సమావేశాలు సైతం నిర్వహించనన్నారు. అలాగే పలు మీడియా ఇంటర్వ్యూలను భారతీయ అగ్రశ్రేణి మీడియా సంస్థలకు ఇచ్చారు.
 
ఇప్పటి వరకూ భారత దేశం నుంచి 80వేల మందికి పైగా యాత్రికులు శ్రీలంక సందర్శించారు. 2023లో ఈ సంఖ్య రెట్టింపు కానుందని అంచనా. తద్వారా ఈ రోడ్‌షోలు మరింతగా విలువను సృష్టించడంతో పాటుగా శ్రీలంక పట్ల సానుకూలత, దీని వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాల పట్ల ఆసక్తి, శ్రీలంక సాంస్కృతిక విలువ, ట్రావెల్‌ అవకాశాలు తెలపడం ద్వారా యాత్రికులు మరింతగా వచ్చేలా చేయనున్నాయి.