దేశంలో నేటి నుంచి 5జీ సేవలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
భారతదేశంలో నేటి నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని ఢిల్లీలో ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను ప్రారంభించారు. దేశంలో 5జీ సేవల రాకతో మరో కొత్త సాంకేతిక విప్లవం మొదలు కానుంది.
ఈ 5జీ సేవల ద్వారా చిన్న వ్యాపారాలకు ప్రయోజనంగా వుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ జియో రాకతో పది రెట్లు పెరగనుంది.
సేల్స్ పీపుల్స్‌కు ఎక్కువ బ్యాండ్ విడ్త్ కలిగిన ఇంటర్ నెట్ కనెక్షన్ 5జీ ద్వారా సాధ్యపడుతుంది. తద్వారా వారి సేల్స్ సామర్థ్యం పెరుగుతుంది. 4జీతో పోల్చితే 5జీ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది.