శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (13:35 IST)

శిశువులకు బంగారు ఉంగరాలు.. రెండు గ్రాములు.. ఫ్రీ స్కీమ్ కాదు..

gold
ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని బంగారు ఉంగరాలను పంపిణీ చేస్తోంది తమిళనాడు బీజేపీ. సెప్టెంబర్ 17వ తేదీన జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ తెలిపింది. 
 
ఉంగరాలను పంపిణీ చేయడానికి ఆర్ఎస్ఆర్ఎం హాస్పిటల్‌ను ఎంచుకున్నట్టు బీజేపీ రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్‌కు తెలిపారు. ప్రతి బంగారు ఉంగరం రెండు గ్రాముల బరువు ఉండనుంది. 
 
ఇది పార్టీ కోసం చేసే ఉచితాల స్కీం కాదన్నారు. శిశువులను స్వాగతించాలని పార్టీ భావిస్తున్నదని, అందుకే ఈ స్కీంను చేపడుతున్నట్టు వివరించారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా 730 కిలోల చేపలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.