మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified గురువారం, 15 సెప్టెంబరు 2022 (14:08 IST)

‘నువ్వు దళితుడివే అయితే, దళితులకే పుడితే’... ఏపీ అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యలు

Meruga
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తనను, దళితులను కించపరిచేలా మేరుగు నాగార్జున మాట్లాడారని కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. అసెంబ్లీలో బీసీ స్టడీ సర్కిళ్ల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘నువ్వు దళితుడివే అయితే దళితులకే పుడితే చంద్రబాబు పంచ నుంచి బయటకు రా’ అంటూ మేరుగు నాగార్జున అన్నారు.

 
మేరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ తమ్మినేని సీతారంకు బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ వివరణ కోరగా తాను తప్పుగా ఏం మాట్లాడలేదని మేరుగు నాగార్జున అన్నారు. అయితే మంత్రి మాట్లాడిన రికార్డును బయటకు తీయాలని స్వామి స్పీకర్‌ను కోరారు. అలాగే మంత్రి మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ఫోను ద్వారా ప్లే చేసేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించగా స్పీకర్ అడ్డుకున్నారు.

 
మేరుగు నాగార్జున మాట్లాడిన రికార్డులను బయటకు తీయాలని స్వామి డిమాండ్ చేయగా తాను తరువాత చూసి చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు.