గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:44 IST)

మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. మృతదేహాలు ఓ చెట్టుకు వేలాడుతూ..

crime scene
ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం చోటుచేసుకుంది. ఉత్తర్​ప్రదేశ్‌లోని లఖింపుర్​ ఖేరిలో దారుణం జరిగింది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. తన కూతుళ్లపై అత్యాచారం చేసి హత్య చేశారని మృతుల తల్లి ఆరోపించింది. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
 
నిఘాసన్​ పోలీస్​ స్టేషన్​ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను ఆరుగురు నిందితులు గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు కలిసి వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం జరిగిన తర్వాత తమను పెళ్లిచేసుకోవాలని నిందితులను ఆ అక్కాచెల్లెళ్లు వేడుకున్నారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.