గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (11:49 IST)

భార్య కొడుతుందని చెట్టెక్కి దాక్కొన్న భర్త.. ఎక్కడ?

man on tree
సమాజంలో జరిగే కొన్ని ఘటనలు వినేందుకు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మరికొన్ని పగలబడి నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఓ భర్త కట్టుకున్న భార్య కొడుతుందని అలిగి చెట్టెక్కి దాక్కున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోపగంజ్ అనే ప్రాంతంలో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన రామ్ ప్రవేశ్ అనే వ్యక్తికి ఆయన భార్యకు తరచూ గొడవలు జరగడం, వారిద్దరూ తరచూ కొట్టుకోవడం జరుగుతుండేవి. భార్య దెబ్బలను తాళలేని ఆయన 80 అడుగులు ఎత్తుండే పామ్‌ చెట్టెక్కి కూర్చొన్నాడు. ఇలా ఒక గంటా లేదా ఒక రోజు కాదు. ఏకంగా నెల రోజులు పాటు అక్కడే ఉంటున్నాడు. 
 
ఇక్కడ విచిత్రమేమిటంటే తనకు ఆకలి అయినప్పుడు గుట్టు చప్పుడుకాకుండా కింది దిగి అన్నపానీయాలు ఆరగించి మళ్లీ చెట్టెక్కి కూర్చోవడం చేయసాగాడు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఎంత నచ్చజెప్పినా రామ్ ప్రవేశ్ పట్టించుకోలేదు. 
 
ఇక చేసేదేం లేక పోలీసులకు సమాచారం చేరవేశారు. వారు అగ్నిమాపకదళ సిబ్బందితో వచ్చిన రామ్ ప్రవేశ్‌ను జాగ్రత్తగా కిందికి దించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.