శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (11:54 IST)

విడాకులు తర్వాత ధనుష్- ఐశ్వర్య.. ఎందుకో తెలుసా?

Dhanush
Dhanush
కోలీవుడ్ టాప్ హీరో ధనుష్- ఐశ్వర్య కొన్ని నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయినా ఇద్దరూ స్నేహితులుగా వుంటున్నారు. ఐష్-ధనుష్ విడాకుల తర్వాత తొలిసారిగా కలిశారు. ఐష్-ధనుష్‌ల తమ పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ కపుల్ హాజరయ్యారు. 
 
యాత్ర స్కూల్‌లో స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీని కోసం వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధనుష్, ఐశ్వర్య తమ పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ సందర్భంగా ఐష్ సోషల్ మీడియాలో ఫోటోలతో పాటు ఓ పోస్ట్ చేసింది. "ఈ రోజు చాలా బాగా మొదలైంది. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు" అని ఐశ్వర్య పోస్ట్ చేసింది.