ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (15:40 IST)

ప్రముఖ తమిళ ఫిల్మ్ క్రిటిక్ ఎల్ఎం కౌశిక్ హఠాన్మరణం

lm koushik
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు, అనలిస్ట్ ఎల్ఎం కౌశిక్ (36) సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన కార్డియాక్ అరెస్టు కారణంగా మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
కౌశిక్‌కు తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరుంది. అనేకమంది సినీ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. ఈయన ట్విటర్ ఖాతాకు అనేక వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. 
 
ఆయన హఠాన్మరణానికి ముందు కూడా "సీతారామం" చిత్రం గురించి ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.50 కోట్లను వసూలు చేసిందని, ఇది అధికారిక న్యూస్ అంటూ పేర్కొన్నారు. 
 
మరోవైపు, కౌశిక్ మృతిపట్ల సినీ హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌తో పాటు హీరో ధనుష్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌, హీరోయిన్ కీర్తి సురేష్ తదితర సినీ సెలెబ్రిటీలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ట్వీట్స్ చేశారు.