సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (12:20 IST)

నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించుకుని తిన్నారు..

zamir khan
zamir khan
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వార్తల్లో నిలిచారు. నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని తీయించుకుని తీన్నారు. బెంగళూరులో కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ జ‌మీర్ అహ్మ‌ద్ ఖాన్ చేసిన ఈ ప‌ని చేశారు. 
 
దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ముందు దళితుడయిన‌ స్వామి నారాయణకు అహ్మ‌ద్ ఖాన్ అన్నం తినిపించారు. 
 
అనంత‌రం ఎమ్మెల్యేకు స్వామి నారాయ‌ణ్‌ తిరిగి అన్నం తినిపించబోతుండగా.. ఆయన వారించి, జమీర్ ఖాన్ చేతిలో ఉన్న అన్నం ముద్ద వ‌ద్ద‌ని, నోట్లో ఉన్న ఆహారాన్ని తీసి తనకు తినిపించాలని కోరారు. దీంతో స్వామి నారాయణ అలాగే చేశారు. దీంతో అక్క‌డున్న వారంతా చ‌ప్ప‌ట్లు కొడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.