బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (09:25 IST)

నేటి నుంచి భారత్ - ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ సిరీస్

ind vs aus
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సిరీస్‌ను ఇరు జట్లకు రిహార్సల్‌గా భావిస్తున్నారు. అయితే, ఈ సిరీస్‌లో ఎవరు ఎలా రాణిస్తారనే అంశం ఇపుడు ఆసక్తికరంగా మారింది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పూర్తి సిరీస్ షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిస్తే, 
 
అయితే, భారత్‌ జట్టుకు ఈ సిరీస్ ఆరంభానికి ముందే గట్టి ఎదురు దెబ్బ తలిగింది. కరోనా వైరస్ కారణంగా మహ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. అయితే, సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులో చేరాడు. 
 
అలాగే, యువ బౌలర్ హర్షన్ పటేల్ కూడా జట్టులో చేరాడు. వీరిద్దూ టీ20 ప్రపంచ కప్ జట్టులోనూ ఉన్నారు. పైగా, చాలా రోజుల తర్వాత బుమ్రా, పటేల్‌ను మైదానంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో వీరిద్దరూ ఎలా రాణిస్తారోనన్న ఆందోళన నెలకొంది. 
 
అలాగే, ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఫామ్‌లోకి రావడం సానుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు. సూర్యకుమార్, హార్దిసక్ పాండ్యా, రిషభ్ పంత్ లేదా దినేశ్ కార్తీక్‌లు కూడా మంచి ఇన్నింగ్స్‌ ఆడి చాలా రోజులైంది. 
 
బౌలర్లు బుమ్రా, హర్షల్‌, భువనేశ్వర్‌, ఉమేశ్‌ యాదవ్‌తో బౌలింగ్‌ దళం పటిష్ఠంగానే ఉంది. భారత్ - ఆస్ట్రేలియా జట్ల విజయాపజయాలు 13-9గా ఉంది. కాగా, సిరీస్‌లో భాగంగా, మంగళవారం తొలి మ్యాచ్‌ మొహాలీలోను, రెండో మ్యాచ్‌ 23న నాగ్‌పూర్‌లో, మూడో మ్యాచ్ 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తారు. ప్రతి మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. 
 
ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తిక్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్‌ యాదవ్, బుమ్రా, దీపక్ చాహర్, హర్షల్‌ పటేల్. 
 
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్‌ హేజిల్‌వుడ్, జోష్ ఇగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, డానియల్ సామ్స్, స్టీవ్‌ స్మిత్, మ్యాథ్యూ వేడ్, ఆడమ్ జంపా.