సంబంధిత వార్తలు
- దేశంలో వేగంగా కరోనా.. 24 గంటల్లో 36మంది మృతి.. కేరళలో తగ్గుముఖం
- జెట్ స్పీడ్ వేగతంతో కరనా వైరస్ వ్యాప్తి : 24 గంటల్లో 1533 కేసులు
- తెలంగాణాలో విషాదం : కరోనా వైరస్ సోకి రెండేళ్ళ బాలుడు
- చెన్నైలో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా ... పుట్టగొడుగుల్లా కొత్త కేసులు
- ఢిల్లీలో మూడో అతిపెద్ద కరోనా హాట్స్పాట్... తుగ్లకాబాద్ సీజ్
విప్రోకు ఎంత పెద్దమనసు.. రోజుకు 60వేల మందికి ఆహారం
కరోనా మహమ్మారి ప్రపంచ దేశ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. దీంతో పలు దేశాలు లాక్ డౌన్‌లో వున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు తంటాలు పడుతున్నాయి. ఇలా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం, వైద్య ఖర్చుల కోసం సెలెబ్రిటీలు, ప్రముఖులు సాయం చేస్తున్నారు. ఇలా ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో యాజమాన్యం కూడా కరోనాపై పోరుకు తన వంతు సాయం చేస్తోంది.
ఈ క్రమంలో తమ సంస్థ ప్రతిరోజు 20 లక్షలకు పైగా ప్రజలకు ఆహారాన్ని సరఫరా చేసిందని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సోమవారం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ కష్టాలు పడుతున్న ప్రజలకు అందిస్తున్న ఇతర సంస్థలు తీసుకున్న సహాయక చర్యలను ఆయన ప్రశంసించారు. మహమ్మారితో పోరాడుతున్న దేశానికి అందరూ సహాయ, సహకారాలు అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విప్రో క్యాంపస్ క్యాంటీన్ల ద్వారా 14-21 రోజులుగా రోజూ 60 వేలకు పైగా ప్రజలకు తాజాగా వండిన భోజనాన్ని, పూర్తిస్థాయి రేషన్ సరుకులను అందజేశామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ప్రకటించారు.
కాగా కోవిడ్ -19 తో పోరాడటానికి అజీమ్ ప్రేమ్‌జీ యాజమాన్యంలోని విప్రో ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఫౌండేషన్ ప్రతిజ్ఞ రూ.1125 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే టాటా గ్రూప్ మొత్తం రూ .1,500 కోట్లను ప్రకటించింది.
