1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. YouTube to offer unskippable 30-second ads on connected TV

యూట్యూబ్‌ ప్రేక్షకులకు విసిగించే నిర్ణయం తీసుకున్న గూగుల్.. ఏంటది?

YouTube
యూట్యూబ్‌లో వీడియో ప్లే అవుతుండగా యాడ్స్ వస్తుంటాయి. ఈ యాడ్లు విసిగిస్తున్నాయంటూ వాపోతున్న యూట్యూబ్ ప్రేక్షకులను మరింత విసిగించే నిర్ణయాన్ని గూగుల్ యాజమాన్యం తీసుకుంది. ఇకపై యాడ్స్ ముప్పై సెకన్ల పాటు కనిపించనున్నాయి. అది కూడా స్కిప్ చేసే అవకాశం లేకుండా మొత్తం చూడాల్సిందేనని తెలిపింది. 
 
ఈ మేరకు కనెక్టెడ్ టీవీలో ప్రకటనలు మొత్తం చూశాకే వీడియో మొదలయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. టీవీ స్క్రీన్‌పై యూట్యూబ్ కంటెంట్ చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న పదిహేను సెకన్ల నాన్ స్కిప్ యాడ్స్ స్థానంలో 30 సెకన్ల యాడ్స్‌ను ప్రసారం చేయనున్నట్లు ఓ బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ తెలిపింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రూ.2 వేల నోట్లు మార్పిడిలో రూల్స్ పాటించాల్సిందే : ఆర్బీఐ గవర్నర్