శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:00 IST)

రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన.. "నిజం"తో ఛానెల్

Ram Gopal Varma
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. నిజం పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. 
 
ఈ ప్రకటనతోనే సంచలన విషయాలు పంచుకున్నారు. "నిజం" యూట్యూబ్ ఛానెల్‌పై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మొదటి ఎపిసోడ్‌గా వివేకా హత్య కేసును ఎంచుకున్నారు. ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వివేకా హత్య ఎపిసోడ్‌ను తన ఛానెల్‌లో విశ్లేషిస్తున్నారు. 
 
వివేకాను హత్య చేయించింది ఎవరు? అసలు దోషులు ఎవరు? హత్యకు గల కారణాలేంటి? మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఏమిటి? నా నిజం ఛానెల్‌తో అబద్దాలు బయటపెడతానన్నారు.
 
ఆర్జీవీ మాట్లాడుతూ, "నా రాబోయే ట్రూత్ యూట్యూబ్ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అబద్ధాలను బహిర్గతం చేయడమే.. దీని ద్వారా నిజం పూర్తి నగ్న ముఖం బయటపడుతుంది. వివేకా హత్య వెనుక ఉన్న నిజాలను వెలికితీస్తాం.." అంటూ చెప్పుకొచ్చారు.