సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (15:31 IST)

కొన్నిగంటలు ఆగిపోయిన యూట్యూబ్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ యూజర్లు గత కొన్ని గంటల నుంచి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. యూట్యూబ్, జీ-మెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ అనల్టిక్స్ వంటి గూగుల్ ఉత్పత్తులు గత కొన్ని గంటలుగా నిలిచిపోయాయి. ఇది మిలియన్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. 
 
కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో గూగుల్ కంపెనీకి చెందిన ఈ సేవలు స్తంభించిపోయాయని, సాంకేతిక సమస్యలతో అవి నిలిచిపోతుండగా, ప్రస్తుతం ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించి క్రమంగా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ ఉదయం నుంచి గూగుల్ ప్రధాన సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ట్విట్టర్‌లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గూగుల్ మాత్రమే కాకుండా పలు కంపెనీల సేవలు కూడా నిలిచిపోయాయని, ఇవన్నీ సాంకేతిక సమస్యల వల్లేనని చెప్తున్నారు.