నేడు తిరువూరులో జగనన్న విద్యా దీవెన నిధులు పంపిణీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు నిధులు అర్హులైన లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు బట్వాడా చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి రిలీజ్ చేశారు.
జగనన్న విద్యా దీవెన పథకం కింద గత యేడాది అక్టోబరు - డిసెంబరు నెలల త్రైమాసికానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేయనున్నారు. ఆదివారం తిరువూరు కేంద్రంగా జరిగే బహిరంగ సభలో మొత్తం 9.86 లక్షల మంది విద్యార్థులు ఖాతాల్లోకి రూ.698.68 కోట్ల నగదును ఆయన జమ చేస్తారు.
ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత క్రమం తప్పకుండా నిధులను జమ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ప్రతి త్రైమాసికం చివరలో సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ.13,311 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసిన విషయం తెల్సిందే.