శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (14:14 IST)

19న విద్యా దీవెన నిధులు జమ : సీఎం జగన్ వెల్లడి

jagan
ఈ నెల 19వ తేదీన విద్యా దీవెన కింద అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను జమ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. 
 
నిజానికి ఈ నెల 18వ తేదీన తిరువూరులో సీఎం జగన్ పాల్గొనే బహిరంగ సభ జరగాల్సివుంది. అయితే, సభ జరిగే ప్రాంగణానికి సమీపంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. ఇక్కడ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఈ సభను మరుసటిరోజుకు వాయిదావేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్య కలగరాదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సభను ప్రభుత్వ అధికారులు మరుసటి రోజుకు వాయిదావేశారు. 
 
కాగా, జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తుంది. ఇంజనీరింగ్, వైద్య, డిగ్రీ, తదితర కోర్సులు చేసే విద్యార్థులకు రూ.20 వేలు ఇందిస్తుంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున అందిస్తుంది. ఈ విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెల్సిందే.