మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (10:14 IST)

విశాఖ వెళ్లేందుకు ముహూర్తం ఖరారు : ఏపీ సీఎం జగన్ వెల్లడి

ysjagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశామని, అక్కడ నుంచి పాలన సాగించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వచ్చే జూలై నుంచి విశాఖపట్టణం నుంచి పాలన సాగుతుందని చెప్పారు. 
 
ఆయన అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, జూలై నెలలో విశాఖకు తరలి వెళుతున్నామన్నారు. విశాఖ నుంచే పాలన ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైకాపానే గెలవాలని స్పష్టం చేశారు. మీ పనితీరును గమనిస్తున్నాను.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
కాగా, విశాఖ నుంచి పాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ ఇటీవల సీఎం జగన్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. పైగా, ఇటీవల వైజాగ్ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించిన విషయం తెల్సిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టుగా తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది.