సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (17:02 IST)

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 31 లోగా?

sajjala ramakrishna reddy
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్‌ సబ్‌ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. 
 
ఈ సమావేశానికి అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... ఉద్యోగ సంఘాలతో పెండింగ్ సమస్యలపై చర్చించామన్నారు. 
 
సుమారు రూ.3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు సజ్జల. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని నిర్ణయించామని సజ్జల వెల్లడించారు. 
 
అందరి ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు చేస్తామని... రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ ఎరియర్స్ అన్నీ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామని సజ్జల చెప్పుకొచ్చారు.