యూట్యూబర్ అగస్త్య చౌహాన్ మృతి.. బైకులో 300 కి.మీ వేగంతో..?
యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో యూట్యూబర్ అగస్త్య చౌహాన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రొఫెషనల్ బైకర్ అయిన అగస్త్య తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
తన ZX10R నింజా సూపర్‌బైక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ స్పీడ్‌కి బైకు నియంత్రణ కోల్పోయింది. దీంతో ప్రమాదం తప్పలేదు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయాడు.
అగస్త్య రేసింగ్ బైకు ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను ఢీకొట్టడంతో అతని హెల్మెట్ ముక్కలైపోయింది. హెల్మెట్ ధరించినా.. అగస్త్య తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.