బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (10:35 IST)

ప్రముఖ యూట్యూబర్ ఇంట విషాదం...

nayani pavani
ప్రముఖ యూట్యూబర్ ఇంట విషాదం నెలకొంది. ఆ యూ ట్యూబర్ ఎవరో కాదు. నయన పావని. షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్, రీల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న శ్వేతా నాయుడు ఆమెతో కలిసి నయని పావని వీడియోలు, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటారు. ఈమె ఇటీవలే ఢీ షోలో కూడా కంటెస్టెంట్స్‌ తరపున లీడర్‌గా కనిపించి కనువిందు చేశారు. ప్రస్తుతం ఆమె ఇంటిలో విషాదం చోటు చేసుకుంది.
 
ఇటీవల నయని పావని తండ్రి మరణించారు. డిసెంబరు 31వ తేదీన ఆమె తండ్రి మరణించినట్టుగా ఓ వార్త వచ్చింది. తాజాగా తన తండ్రి భౌతికకాయం వద్ద ఆయన కాళ్లు పట్టుకుని ఏడుస్తున్న ఫోటోని తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. 
 
"మళ్లీ నిన్ను చూడాలనుకుంటున్నాను నాన్న.. నా ఈ బాధని ఎవరూ దూరం చేయలేరు" అంటూ నయని పావని పోస్ట్ చేశారు. అలాగే, తన పెంపుడు కుక్కని పట్టుకుని ఏడుస్తూ కొన్ని ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. ఈ వార్త తెలిసిన నెటిజన్లు, స్నేహితులు ఆమెను ఓదార్చుతూ కామెంట్స్ పెడుతున్నారు.