శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (13:50 IST)

నెమలిని టార్చర్ పెట్టి చంపేసిన యువకుడు.. ఈకలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ..?

Peacock Feather
జాతీయ పక్షి అయిన నెమలిని టార్చర్ పెట్టి చంపేశాడు ఓ యువకుడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. ఆ నెమలికి నరకం చూపించాడు. బాధ తట్టుకోలేక చివరికి అది మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీలో జిల్లాలో చోటుచేసుకుంది. 
 
ఈ వీడియోను చూసిన వారంతా ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీడియోలో కనిపించిన బైక్ ఆధారంగా నిందితుడిని అతుల్‌గా గుర్తించినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. అయితే ఆ యువకుడు పోలీసులకు చిక్కలేదని.. పరారీలో వున్నాడని తెలిసింది.