1. వార్తలు
  2. »
  3. ఐటీ
  4. »
  5. ఐటీ వార్తలు

యూఎస్ ఐటీ కంపెనీలపై భారత్ దృష్టి

దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో కంపెనీ..  600 మిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా ఐటి కంపెనీని తన వశం
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో కంపెనీ.. 600 మిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా ఐటి కంపెనీని తన వశం చేసుకుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ సర్వీస్ ఉత్పత్తి చేసే ఇన్ఫోక్రాసింగ్ అనే కంపెనినీ విప్రో తమలో విలినం చేసుకుంది. ఈ తరహ విలినంతో భారత ఐటి కంపెనీలకి అమెరికా ఐటి కంపెనీలను పొందే సత్త ఉందని ప్రపంచానికి చాటిజెప్పాయి.

దేశంలోని ప్రముఖ వాణిజ్య సంస్థ టాటాలు యూరప్‌కు చెందిన కోరస్ ఉక్కు కంపెనీని స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే. భారతీయ ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఆర్సెల్ ఉక్కు కంపెనినీ స్వాధినం చేసుకోవటం వంటి సంఘటనలు భారతీయుల శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలియజెప్పాయి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి