సంబంధిత వార్తలు
- శిరీష పెదవులపై గాట్లు, తలపై గాయాలు... కొట్టి చంపి ఉరి వేశారా?, లింకుందన్న తేజస్విని ఎవరు?
- ప్రేమను తిరస్కరించిందనీ.. అందరూ చూస్తుండగానే వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు!
- ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?
- ఇలా చూపించి వెళ్లాలని నాకు తెలీదే.. జగన్ దెప్పుతో ఖంగు తిన్న రామకృష్ణుడు
- మూడురోజుల్లో మంత్రిపదవి ఇస్తామని లాగేశారు... ఏదీ? మనిషే లేకుండా పోయారు
పాదయాత్ర : జగన్ మోహన్ రెడ్డి, రోజా పాదాలు ఇలా అయ్యాయి(ఫోటోలు)
ఇంతకుముందు పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాలు ఎలా అయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్న జగన్, రోజాల పాదాలు బొబ్బలెక్కిపోయాయి. వారి పాదాలకు చికిత్స చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుంది. 180 రోజుల పాటు 3 వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. మొత్తం 125 నియోజకవర్గాలు, 10 వేల నివాసిత ప్రాంతాలు, గ్రామాల్లో సాగనుంది. మొత్తం 180 రోజుల్లో 125 బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇదిలావుంటే పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి పాదాలకు గాయాలయ్యాయి. వాటికి చికిత్స తీసుకుని మళ్లీ పాదయాత్ర చేస్తున్నారు.
మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా గాలేరు-నగరి ప్రాజెక్టు కోసం తిరుమల వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ఆమె పాదాలకు కూడా గాయాలయ్యాయి. ఈ ఫోటోలో చూడండి.