శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi

ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?

ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఆవేదనతో ఓ ప్రేమికుడు ప్రియురాలు చదువుతున్న కళాశా

ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమ ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరం చెప్పారనే ఆవేదనతో ఓ ప్రేమికుడు ప్రియురాలు చదువుతున్న కళాశాలకు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి కలిసి నిప్పంటించుకున్న దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కొట్టాయం మెడికల్ కళాశాలకు చెందిన ఆదర్శ్, లక్ష్మీలు ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆవేదన చెందిన ఆదర్శ్ లక్ష్మీ చదువుతున్న కొట్టాయం మెడికల్ ఎడ్యుకేషన్ స్కూలుకు వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి ఆమెతోపాటు కలిసి నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 70శాతం శరీరం నిప్పుతో తీవ్రంగా గాయాలకు గురైందని వైద్యులు చెపుతున్నారు.